నాగార్జున కింగ్ 100 గ్లింప్స్ డేట్ ఫిక్స్

Nagarjuna’s King 100 Glimpse Date Locked

కింగ్ నాగార్జున ప్రస్తుతం తన కెరీర్‌లో ప్రతిష్ఠాత్మకమైన 100వ చిత్రంలో నటిస్తున్నారు. #King100 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో ఆయన తెలుగులో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. తమ అభిమాన హీరో 100వ సినిమాకు ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

ఈ చిత్రంలో నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడ మా ఆవిడే’ వంటి చిత్రాల్లో నాగార్జునతో కలిసి నటించిన టబు.. చాలా కాలం తర్వాత మరోసారి ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం సినిమాపై అంచనాలను పెంచుతోంది.

భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్‌తో పాటు సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను కూడా మేకర్స్ వెల్లడించనున్నారు.

నాగార్జున పుట్టినరోజుకు మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో #King100 టైటిల్ గ్లింప్స్‌పై ఆసక్తి మరింత పెరుగుతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.