లెనిన్ థర్డ్ సింగిల్ సోల్ ఆఫ్ లెనిన్ వీడియో రిలీజ్

Soul of Lenin Video out from Lenin

అక్కినేని అఖిల్ కథానాయకుడిగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ విలేజ్ లవ్ అండ్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ మూడో సాంగ్ సోల్ ఆఫ్ వీడియో ని విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన “వారే వా వారే వా”, “యెట్టా యెట్టా” పాటలు మాస్ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే, సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మేకర్స్ మూడో సాంగ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ఈ సాంగ్ ఒక అందమైన విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్యూర్ అండ్ ఎమోషనల్ లవ్ యాంథమ్. నిస్వార్థమైన ప్రేమ, త్యాగం, ఒకరికొకరు తోడుగా ఉండే భావోద్వేగాల చుట్టూ ఈ పాటను అద్భుతంగా మలిచారు.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. గత రెండు పాటలకు మాస్ బీట్స్ ఇచ్చిన థమన్, ఈసారి తన మార్క్ మెలోడీ మరియు హార్ట్-టచింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు.

లీడ్ పెయిర్ అఖిల్, భాగ్యశ్రీ బోర్సేల మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ మరియు విజువల్స్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పీ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నేటివ్ టచ్‌తో కూడిన స్టోరీలైన్‌తో, పవర్‌ఫుల్ ఎమోషన్స్‌తో విలేజ్ డ్రామాగా ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వబోతోంది. ఈ చిత్రానికి లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ అందించగా, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. జూన్ 26న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.