ఇంట్రెస్టింగ్ గా మా ఇంటి బంగారం ట్రైలర్

Maa Inti Bangaram Trailer Looks Interesting

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ.. తన హోమ్ బ్యానర్ ‘ట్రాలాలా మూవీ పిక్చర్స్ పై స్వయంగా నిర్మిస్తున్న మోస్ట్ అవైటెడ్ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం’. ‘ఓ బేబీ’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత సమంత – టాలెంటెడ్ లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన ఈ చిత్ర అఫీషియల్ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ట్రైలర్ ప్రారంభంలో సమంత ఒక పక్కా సాంప్రదాయబద్ధమైన, అమాయకపు పల్లెటూరి కోడలిగా కనిపిస్తుంది. ఉమ్మడి కుటుంబంలో భర్త, అత్తమామలతో కలిసి ఎంతో సర్దుకుపోతూ ఉండే ఒక సాధారణ గృహిణిగా సామ్ నటన ఆకట్టుకుంటుంది.

అయితే, “ఈ హోమ్‌లీ టైటిల్ వెనుక ఒక చీకటి కోణం, విపరీతమైన పగ దాగి ఉన్నాయి” అని మేకర్స్ హింట్ ఇచ్చారు. గతం నుంచి వచ్చిన ఒక ఊహించని ప్రమాదం తన కొత్త కుటుంబాన్ని చుట్టుముట్టినప్పుడు.. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం సమంత ఏకంగా ఆయుధం పట్టి చీరకట్టులోనే పవర్‌ఫుల్ యాక్షన్ మోడ్‌లోకి దిగుతుంది. కేవలం గృహిణిగా మాత్రమే కాకుండా, ఫ్యామిలీ కోసం ఎదురుతిరిగే ఒక ఇంటెన్స్ యాక్షన్ ఉమెన్‌గా సమంత ఈ ట్రైలర్‌లో విశ్వరూపం చూపించింది.

ఈ చిత్రానికి రాజ్ నిడిమోరు మరియు వసంత్ కథను అందించగా.. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు. సమంతతో పాటు గుల్షన్ దేవయ్య, దిగంత్, గౌతమి, శ్రీముఖి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.’మా ఇంటి బంగారం’ చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.