130 కోట్ల కలెక్షన్లతో కరుప్పు ఆల్‌టైమ్ రికార్డ్ విధ్వంసం

Karuppu’ Smashes All-Time Records with ₹130 Crore Collections

కోలీవుడ్ స్టార్ హీరో, వర్సటైల్ యాక్టర్ సూర్య కథానాయకుడిగా వచ్చిన లేటెస్ట్ కల్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) తమిళనాడు బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ.. కేవలం 10 రోజుల్లోనే తమిళనాడులో ₹130 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేకింగ్ హిస్టారికల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

వైవిధ్యమైన చిత్రాల దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు ఒక మెగా బ్లాక్‌బస్టర్ విందును అందిస్తోంది. సూర్యను సరికొత్త రగ్గడ్ మరియు ఇంటెన్స్ రోల్‌లో ఆర్జే బాలాజీ ప్రెజెంట్ చేసిన తీరుకు ఇటు అభిమానులు, అటు నార్మల్ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఇక వరుస పరాజయాల తరువాత సూర్య ఈసినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు.

ట్రెండింగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్అందించిన సాంగ్స్, గూస్‌బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లను షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్‌లో వచ్చే మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి జీకే విష్ణు సినిమాటోగ్రఫీ, విక్రమ్ మోర్ యాక్షన్ కొరియోగ్రఫీ మేజర్ అసెట్స్‌గా నిలిచాయి. నట్టి నటరాజ్, ఇంద్రన్స్, స్వాసిక, శివద, సుప్రీత్ రెడ్డి కీలక పాత్రల్లో అదరగొట్టారు.

తమిళనాడులోనే కాకుండా ఓవర్సీస్, అటు తెలుగు రాష్ట్రాల్లోనూ ‘వీరభద్రుడు’ పేరుతో ఈ చిత్రం సాలిడ్ వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా దాదాపు 25కోట్ల వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఈసినిమా 250కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టకొని సూర్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. ఫుల్ రన్ లో 300కోట్ల క్లబ్ లో చేరనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.