పెద్ది నేను వెంటనే చేస్తానని చరణ్ గారికి చెప్పాను – శివరాజ్ కుమార్ 

Shivarajkumar Says He Quickly Accepted Ram Charan’s Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ నేపధ్యంలో చిత్ర బృందం బెంగళూరులో గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. రామ్ చరణ్ చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. తన తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు ఎంతో నిజాయితీగా పనిచేస్తూ వచ్చారు. తల్లిదండ్రులు, పవన్ కళ్యాణ్ గారు, అభిమానుల ఆశీర్వాదాలు ఆయనకు ఎప్పుడూ వుంటాయి. ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు ఒక కార్యక్రమంలో పక్కపక్కనే కూర్చున్నారు. వారి మధ్య ఆప్యాయత నన్ను ఎంతో హత్తుకుంది. నాకు పునీత్‌తో ఉన్న అనుబంధం లాంటిదే.  రామ్ చరణ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా అనిపించింది. నిర్మాత సతీష్ గారు, దర్శకుడు బుచ్చిబాబు గారు, రత్నవేలు గారు అందరూ నాకు ఎంతో ప్రేమ, ఆప్యాయత చూపించారు. ‘పెద్ది’ సినిమాతో రామ్ చరణ్ గారికి కచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందని నేను నమ్ముతున్నాను. చిరంజీవి గారంటే మనందరికీ ఎంతో అభిమానం.

ఆయన పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో నేను కూడా పాల్గొని రక్తదానం చేశాను. ప్రేక్షకులు చిరంజీవి గారి కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తారు. అలాంటి ఆప్యాయతను నేను ఎక్కడా చూడలేదు. మన మధ్య భాషా భేదాలు లేవు. మంచి కళాకారులను మనం ఎప్పుడూ ప్రేమతో ఆదరిస్తాం. ఈ సినిమాలో ఒక పాత్ర ఉందని చెప్పగానే నేను వెంటనే చేస్తానని చరణ్ గారికి చెప్పాను. బుచ్చిబాబు గారు నా పాత్రను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. మా ఇద్దరి మధ్య ఉండే బాండింగ్ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో బలమైన భావోద్వేగం ఉంది. బుచ్చిబాబు గారు చెప్పిన కథ ప్రతి ప్రేక్షకుడిని కచ్చితంగా కనెక్ట్ చేస్తుంది. ‘పెద్ది’ పాత్ర ప్రతి ఒక్కరి హృదయంలో నిలిచిపోతుంది. జూన్ 4 కోసం నేనూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.