రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘పెద్ది’ విడుదలకు ముందే టాలీవుడ్లో సరికొత్త హాట్ టాపిక్‌గా మారింది. జూన్ 4న సినిమాను గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తుండగా.. నైజాం (తెలంగాణ) ఏరియాలో ఈ సినిమా ప్రదర్శనపై నీలినీడలు కమ్ముకున్నాయి. “పర్సంటేజ్ విధానాన్ని ఒప్పుకుంటేనే తెలంగాణలో ‘పెద్ది’ని రిలీజ్ చేస్తాం” అంటూ థియేటర్ల యజమానులు (ఎగ్జిబిటర్లు) అత్యంత కీలకమైన అల్టిమేటం జారీ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శనివారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన ఎగ్జిబిటర్ల అత్యవసర సమావేశం అనంతరం వారు మీడియా ముఖంగా తమ గళాన్ని గట్టిగా వినిపించారు.
గత చాలా కాలంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సినిమాలను ‘ఫిక్స్డ్ రెంట్లు’ లేదా అద్దె పద్ధతిలోనే థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. దీనివల్ల సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఎగ్జిబిటర్లు భారీగా నష్టపోవాల్సి వస్తోంది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ మాట్లాడుతూ.. “గతంలో ‘హరిహర వీరమల్లు’ విడుదల సమయంలోనే రెండు మూడు నెలల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఏడాది దాటినా ఎలాంటి ముందడుగు పడలేదు. నిర్మాతలు వారాలు వాయిదా వేస్తూ వస్తున్నారు. అందుకే ఈసారి ‘పెద్ది’ చిత్రానికి ఖచ్చితంగా పర్సంటేజీ విధానాన్ని అమలు చేయాల్సిందే” అని డిమాండ్ చేశారు.
మాకు ‘పెద్ది’ సినిమాపై గానీ, రామ్ చరణ్ గారిపై గానీ ఎలాంటి పగ లేదు. ఇండస్ట్రీని నిలబెట్టే ఇలాంటి పెద్ద సినిమాలకు మేము సెల్యూట్ చేస్తాం. కానీ దాదాపు 120 మందికి పైగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు ప్రస్తుతం తీవ్రమైన దీనస్థితిలో ఉన్నారు. నిర్మాతలకు ఓటీటీ, శాటిలైట్, ఆడియో ఇలా 14 రకాలుగా ఆదాయం వస్తోంది. కానీ థియేటర్ ఓనర్లకు మాత్రం రెవెన్యూ రావడం లేదు. థియేటర్లు బతకాలంటే పర్సంటేజ్ పద్ధతి ఒక్కటే మార్గం” అని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు.
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు లేదు:
సినిమా బిజినెస్ వర్గాల్లో టికెట్ ధరలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎగ్జిబిటర్లు ప్రేక్షకులకు పెద్ద ఊరటనిచ్చారు. తెలంగాణలో ‘పెద్ది’ సినిమాకు ఎలాంటి టికెట్ రేట్ల పెంపు ఉండబోదని స్పష్టం చేశారు. “సినిమా టికెట్ ధరలను పెంచవద్దని, మేము ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారికి, అలాగే ఎగ్జిబిటర్లు, ఫిల్మ్ ఛాంబర్‌కు అధికారికంగా లేఖలు ఇచ్చాం. తెలంగాణలో రేట్ల పెంపు ఉండదు. అయితే, ఆంధ్రాలో మాత్రం ‘పెద్ది’ టికెట్ రేట్ల పెంపు ఉండే ఛాన్స్ ఉంది” అని వారు వెల్లడించారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























