సినిమా ప్రియులకు సరికొత్త గ్లామర్ ట్రీట్ ఇచ్చేందుకు బాలీవుడ్ బ్యూటీ నర్గిస్ ఫక్రి టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. హవీష్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘నేను రెడీ’ లో ఆమె ఒక ప్రత్యేక గీతం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.ఈ రోజు చిత్ర బృందం దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నర్గిస్ ఫక్రి తెలుగు తెరపై కనిపించడం ఇదే మొదటిసారి. ఈ పాట కోసం ఆమెకు సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.పోస్టర్‌లో ఆమె మెరిసే దుస్తుల్లో అద్భుతమైన గ్లామరస్ లుక్‌తో ఆకట్టుకుంటోంది.
ఈ ప్రత్యేక గీతానికి సంబంధించిన షూటింగ్‌ను ఇప్పటికే చిత్ర బృందం పూర్తి చేసింది.ఈ చిత్రంలో ‘నువ్విలా’, ‘సెవెన్’ చిత్రాల ఫేమ్ హవీష్ హీరోగా నటిస్తుండగా.. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
‘ధమాకా’ వంటి మాస్ ఎంటర్‌టైనర్ అందించిన దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు సంయుక్తంగా హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మాస్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో, నర్గిస్ ఫక్రి గ్లామర్ తో తోడవ్వడంతో ఈ స్పెషల్ సాంగ్ థియేటర్లలో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ అందించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























