టాలీవుడ్ యువసామ్రాట్ నాగచైతన్య, ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మిస్టరీ థ్రిల్లర్ వృషకర్మ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాజస్థాన్‌లోని పురాతన, గంభీరమైన కోటలు, రాజభవనాల నేపథ్యంలో ప్లాన్ చేసిన ఒక అత్యంత కీలకమైన షూటింగ్ షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ విజయవంతంగా పూర్తి చేసింది. కథ పరంగా ఈ షెడ్యూల్ సినిమాకు చాలా కీలకం కానుందని తెలుస్తోంది.
షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడంతో.. ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా అంతే వేగంగా జరుపుతున్నారు. భారతీయ ప్రేక్షకులకు ఇంతకుముందెన్నడూ చూడని ఒక వినూత్నమైన మైథికల్ థ్రిల్లర్ అనుభూతిని అందించడం కోసం భారీ ఎత్తున విజువల్ ఎఫెక్ట్స్ పనులు జరుగుతున్నాయి.
ప్రస్తుతం పనులు జరుగుతున్న స్పీడ్ చూస్తుంటే, త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
‘విరూపాక్ష’ వంటి బ్లాక్‌బస్టర్‌తో మెప్పించిన కార్తీక్ దండు విజన్.. నాగచైతన్య లుక్స్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. మైథాలజీ మరియు థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా భారీ బడ్జెట్ తో ఎస్విసీసీ నిర్మిస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























