మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ ట్రైలర్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. మే 18న ముంబైలో ఈ చిత్ర ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయబోతుండగా, చిరంజీవి ఈ ట్రైలర్‌ను ముందే వీక్షించి సోషల్ మీడియా వేదికగా తన రివ్యూ ఇచ్చారు. అంతేకాదు, తనదైన శైలిలో ఒక క్రేజీ డైలాగ్‌ను కూడా లీక్ చేశారు!
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పెద్ది ట్రైలర్ చూశాను జస్ట్ వావ్… 3 నిమిషాల పాటు సాగిన ఈ ట్రైలర్ ప్యూర్ ఫైర్‌పవర్ ప్యాక్డ్గా ఉంది” అని చిరు కొనియాడారు. చరణ్, బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్.. ఇలా ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారని, అందరూ కలిసి రఫ్ఫాడించేశారని ప్రశంసించారు.
అంచనాలకు మించి: “మనం ఎంత ఊహించుకున్నా.. దాన్ని మించి ఈ ట్రైలర్ ఉంటుంది. ఇందులో ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్నెస్ అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి” అని ట్వీట్ చేశారు.
అంతేకాకుండా ట్రైలర్‌లోని ఒక పవర్ఫుల్ డైలాగ్‌ను లీక్ చేశారు.
“మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు… నేను పోరాడాను సారు..”
ఈ డైలాగ్ లీక్ చేసిన అనంతరం చిరు సరదాగా స్పందిస్తూ.. “చాలా రోజులయింది మీకు ‘చిరు లీక్స్’ ఇచ్చి.. సారీ బుచ్చి బాబు.. ట్రైలర్ చూశాక కంట్రోల్ తప్పా” అంటూ చమత్కరించారు.
మెగాస్టార్ స్వయంగా ఇచ్చిన ఈ సాలిడ్ రివ్యూ మరియు డైలాగ్ లీక్‌తో మెగా అభిమానుల్లో మే 18న రాబోతున్న అఫీషియల్ ట్రైలర్‌పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























