ధురంధర్: ది రివెంజ్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది

OTT Release Date Locked for Dhurandhar: The Revenge

బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధించిన ‘ధురంధర్: ది రివెంజ్’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. భారత్‌లో జియో హాట్‌స్టార్ వేదికగా ఈ విడుదలకానుండగా ఇతర దేశాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జియో హాట్ స్టార్ ఈసినిమాను జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. అయితే అంత కన్నా ముందే జూన్ 4 రాత్రి 7 గంటలకు ప్రత్యేక ప్రీమియర్ ప్రదర్శించనున్నారు.ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో అందుబాటులో ఉండనుంది.

రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.థియేటర్లలో ఈ సినిమా నిడివి 3 గంటల 49 నిమిషాలు ఉండగా, ఓటీటీ వెర్షన్‌లో మరికొన్ని అదనపు సన్నివేశాలను జోడించారు. దీంతో ఓటీటీ రన్ టైం 3 గంటల 52 నిమిషాలుగా ఉండబోతోంది.

కథ :ఇది ఒక గూఢచారి కథ. ఆపరేషన్ ధురంధర్‌లో భాగంగా జస్కిరాత్ సింగ్ తన పేరును హమ్జా అలీ మజారీ (రణ్‌వీర్ సింగ్)గా మార్చుకుని పాకిస్థాన్ వెళ్తాడు. అక్కడ గ్యాంగ్‌స్టర్లు మరియు ఉగ్రవాదుల కుట్రలను ఎలా అడ్డుకున్నాడు? అన్నదే ఈ సినిమా ఇతివృత్తం. ఇందులో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు.యాక్షన్ ప్రియులు థియేటర్లలో మిస్ అయిన ఈ భారీ చిత్రాన్ని జూన్ 5 నుండి ఓటీటీలో వీక్షించవచ్చు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.