గాయపడ్డ సింహంలో క్యామియో రోల్ చేశా – శ్రీ విష్ణు

Sree Vishnu Confirms Cameo in Gayapadda Simham

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’ తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో హీరో శ్రీవిష్ణు స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. గాయపడ్డ సింహం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ విసా స్టాపింగ్ ఈవెంట్ నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ ఈవెంట్‌కు వచ్చిన అందరికీ థాంక్యూ. విప్లవ్ ఎడిటింగ్ ఫెంటాస్టిక్‌గా ఉంటుంది. స్వీకర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు చాలా బాగున్నాయి, బీజీఎమ్ అదిరిపోయింది. మానస నా సినిమాలో క్యామియో చేసింది కాబట్టి, నేను కూడా తన సినిమాలో చేశాను (నవ్వుతూ). డైరెక్టర్ కశ్యప్‌కి ప్రత్యేకమైన టైమింగ్ ఉంది. ఆ టైమింగ్‌ను ఈ సినిమాలో బాగా వాడుకున్నారని అనుకుంటున్నాను. చాలా అద్భుతంగా వచ్చింది. చిన్నప్పటి నుంచి జేడీ గారి సినిమాలు చూస్తూ పెరిగాం. ఆయన ఇంకా మరిన్ని సినిమాలు చేసి మమ్మల్ని ఇన్‌స్పైర్ చేయాలి. ఈ సినిమాలో నేను చేయడానికి ఒక కారణం నారా రోహిత్ గారు కూడా. ఆయన నా సినిమాల్లో చాలాసార్లు క్యామియో చేశారు (నవ్వుతూ). పవన్ సాదినేని డైరెక్ట్ చేస్తున్నప్పుడు మొదటి హీరోగా నేనే చేశాను. ఇప్పుడు ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు కూడా నేను చేయడం ఆనందంగా ఉంది. విజయ్, భాను, కళ్యాణ్ — వీరంతా నా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ల కోసం నా వంతు కాంట్రిబ్యూషన్‌గా ఈ సినిమా చేశాను. ఈ ఈవెంట్‌కు వచ్చిన దర్శకులందరికీ థాంక్యూ.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.