యంగ్ హీరో సుమంత్ ప్రభాస్, రొమాన్స్, కామెడీ, కుటుంబ భావోద్వేగాలతో కూడిన ఆహ్లాదకరమైన రూరల్ డ్రామా ‘గోదారి గట్టుపైన’తో ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. నూతన దర్శకుడు సుభాష్ చంద్ర దర్శకత్వంలో, రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో నిధి ప్రదీప్ కథానాయికగా నటించగా, జగపతి బాబు కథకు బలాన్ని చేకూర్చే కీలక పాత్రలో కనిపించారు. టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చిత్ర బృందం ఇప్పుడు ట్రైలర్‌ను విడుదల చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ కథ రాజు అనే సాధారణ ఆటో డ్రైవర్, అతని ఆటోలో ప్రతిరోజూ ప్రయాణించే కాలేజ్ అమ్మాయి మాయ మధ్య సాగే మధురమైన ప్రేమకథ. మొదట నిశ్శబ్దమైన అభిమానం తర్వాత ప్రేమగా మారుతుంది. మాయ కూడా అతని ప్రేమను అంగీకరిస్తుంది. కానీ వారి ప్రయాణం అంత సులభం కాదు. మాయ తండ్రి అనుమతి పొందడం రాజుకు పెద్ద సవాలుగా మారుతుంది. దీంతో వారి ప్రేమ ఒక ఎమోషనల్ ఫైట్ గా మారుతుంది.
సుమంత్ ప్రభాస్ గ్రామీణ యువకుడి పాత్రలో సహజంగా ఒదిగిపోయి, గోదావరి యాసతో ఆకట్టుకున్నారు. మాయగా నిధి ప్రదీప్ ఫ్రెష్‌గా కనిపిస్తూ, ప్రేమ, తండ్రి మధ్య డైలమాలో ఉన్న భావోద్వేగాన్ని చక్కగా చూపించారు. జగపతి బాబు టఫ్, అదే సమయంలో ప్రేమగల తండ్రిగా ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. లైలా ఆయన భార్యగా భావోద్వేగానికి బలం చేకూర్చారు. సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ మంచి కామెడీ జోడించారు.
దర్శకుడు సుభాష్ చంద్ర సహజమైన గ్రామీణ ప్రేమకథను కుటుంబ భావోద్వేగాలతో కలిపి వినోదాత్మకంగా మలిచారు. ప్రేమ కథతో పాటు, తండ్రి-కూతురు భావోద్వేగం హైలెట్ గా నిలిచింది.
సినిమాటోగ్రాఫర్ సాయి సంతోష్ గోదావరి అందాలను అద్భుతంగా చూపించగా, నాగ వంశీ కృష్ణ సంగీతం కథను మరింత ఎలివేట్ చేస్తోంది. ప్రొడక్షన్ డిజైనర్ ప్రవల్య, ఎడిటర్ అనిల్ కుమార్ పి తమ వర్క్ తో సినిమాకు మంచి విజువల్ రిచ్‌నెస్ తీసుకువచ్చారు.
‘గోదారి గట్టుపైన’ యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోనుందని ట్రైలర్ ప్రామిస్ చేస్తోంది. ఈ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. “మేము ‘ఫేమస్’ సినిమాకు మీరు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ఈ సినిమాకి కూడా అలాగే ఆదరణ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను పుట్టి పెరిగింది తెలంగాణ. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా గోదారి యాస నేర్చుకుని మాట్లాడాను. ప్రతి డైలాగ్‌ను సహజంగా చెప్పడానికి ప్రయత్నించాను. ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమా ఇంత బాగా రావడానికి మా డైరెక్టర్ , టీమ్ కారణం. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. నిధి కూడా చాలా చక్కగా తెలుగు నేర్చుకుని మాట్లాడింది, చాలా హార్డ్ వర్క్ చేసింది. రాజీవ్ కనకాల గారు, దేవి ప్రసాద్ గారు, శ్రీవాణి గారికి థాంక్స్. వారితో కలిసి నటించడం చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. జగపతిబాబు గారితో పని చేయడం గొప్ప అనుభవం. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. నిర్మాత అభినవ్ గారు సినిమాను ఎంతో అద్భుతంగా నిర్మించారు. రెడ్ పపెట్ ప్రొడక్షన్స్ చాలా పెద్ద స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. కృష్ణపట్నం ఫుడ్ ఎంత టేస్టీగా ఉంటుందో, మా సినిమా కూడా అంత క్యూట్‌గా ఉంటుంది. ఈ ట్రైలర్లో మీరు చూసింది సినిమాలో ఉంటుంది. సినిమాలో ఉన్నదే మన జీవితంలో ఉంటుంది. ఇది పూర్తిగా రిలేట్ అయ్యే సినిమా. గోదావరి ప్రాంతం చాలా అందంగా ఉంటుంది. అక్కడి లొకేషన్స్ నాకు కేరళ కంటే అందంగా అనిపించాయి. మే8న మీ ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను చూడండి. గోదావరిలో పడితే బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది… కానీ మా ‘గోదారి గట్టుపైన’ ప్రేమలో పడితే బయటకు రావడం కష్టం. అంతగా మీరు సినిమాను ప్రేమిస్తారు. ఈ సమ్మర్ లో సినిమా అందరికీ కూల్ వైబ్ ఇస్తుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























