జన నాయగన్ ఎడిటర్ పై సప్సెన్షన్ వేటు

suspension imposed on jana nayagan editor

తమిళ స్టార్ హీరో విజయ్ తన రాజకీయ ప్రయాణానికి ముందు నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫుటేజ్ ఆన్‌లైన్‌లో లీక్ అయిన నేపథ్యంలో, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఎడిటర్స్ అసోసియేషన్ (SIFEA) సంచలన నిర్ణయం తీసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జన నాయగన్ చిత్ర ఎడిటర్ ప్రదీప్ ఇ. రాఘవ్ ను ఎడిటర్స్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది. సినిమా అవుట్‌పుట్ ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడానికి అతని అజాగ్రత్తే కారణమని అసోసియేషన్ పేర్కొంది.

ప్రదీప్ రాఘవ్ ఈ సినిమాతో పాటు ఇతర ప్రాజెక్టులకు కూడా అసోసియేషన్‌లో సభ్యత్వం లేని వ్యక్తులను అసిస్టెంట్లుగా నియమించుకున్నారని, ఇది సంఘం నిబంధనలకు విరుద్ధమని అసోసియేషన్ వెల్లడించింది.

సెన్సార్ బోర్డ్ సర్టిఫికేషన్ కోసం వేచి చూస్తున్న సమయంలోనే ఈ సినిమాలోని కీలకమైన సీన్లు మరియు ఫుటేజ్ అక్రమంగా ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఈ ఘటనపై తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేపట్టి, ఒక ఫ్రీలాన్స్ ఎడిటర్ సహా మొత్తం తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.

ఇలాంటి నిర్లక్ష్యం వల్ల చిత్ర పరిశ్రమకు పెద్ద ముప్పు పొంచి ఉందని, అందుకే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ప్రదీప్ రాఘవ్‌కు ఎటువంటి సహకారం అందించకూడదని అసోసియేషన్ నిర్ణయించింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.