సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఈ సినిమా అంతా కూడా తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో సాగుతుంది. ఇక ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ నిర్మిస్తోంది. మదిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఎంతో సుదీర్ఘమైన, సవాలుతో కూడిన షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పూర్తయిందని మేకర్స్ తెలిపారు. ప్రతీదీ రియలిస్టిక్‌గా ఉండాలన్న ఉద్దేశంలో రియల్ లొకేషన్స్‌లో ఎంతో శ్రమించి షూటింగ్ చేశారు. ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్, ఒళ్లుగగుర్పొడిచే సెయిల్‌బోట్ రేస్ సన్నివేశాలు ఇలా ఎన్నెన్నో ఈ చిత్రంలో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో పోస్ట్-ప్రొడక్షన్ కార్యక్రమాల్ని ప్రారంభించారు. సూరి, సుహాస్‌లు పాత్రలకు తగ్గట్టుగా తమ శరీరాకృతిని, లుక్స్‌ను మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీతో సుహాస్ కోలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. ఇందులో సుహాస్ ఓ డిఫరెంట్ పాత్రను పోషించారు. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం సుహాస్ ఏకంగా వంద రోజుల్ని కేటాయించారు. వంద రోజుల కాల్ షీట్లను ఇవ్వడం చూస్తుంటే అతనికి ఈ మూవీ మీద ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది.
ఈ మూవీలో మహిమా నంబియార్ హీరోయిన్గా నటించగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్‌ను డి.ఆర్.కె. కిరణ్, ఎడిటింగ్‌ను ప్రదీప్ ఇ. రాఘవ్, యాక్షన్ సన్నివేశాలకు పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేశారు. చిత్ర బృందం ఎడిటింగ్, సౌండ్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్, సంగీతం వంటి పోస్ట్-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అద్భుతమైన క్వాలిటీని అందించేందుకు టీం కష్టపడుతోంది. త్వరలోనే ఇతర అప్డేట్లను మేకర్స్ ప్రకటించనున్నారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, సాయి కుమార్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

























