సమంత ప్రధాన పాత్రలో బి.వి. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ యాక్షన్ డ్రామా మా ఇంటి బంగారం. మే 15, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సమంత తన సొంత నిర్మాణ సంస్థ ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వురుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ సినిమా నుండి మొదటి సింగిల్ ‘తస్సాదియ్యా’ పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ఇది ఒక ఎనర్జిటిక్ ఫ్యామిలీ సెలబ్రేషన్ సాంగ్‌గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.సమంత మరియు నందినీ రెడ్డి కాంబినేషన్లో ‘ఓ బేబీ’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి.
ఈ చిత్రంలో సమంత ఒక మధ్యతరగతి గృహిణిగా కనిపిస్తూనే, తన గతానికి సంబంధించిన కొన్ని రహస్యాలతో సాగే యాక్షన్ సీక్వెన్స్‌లలో పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. గుల్షన్ దేవయ్య, దిగంత్, గౌతమి, సత్యరాజ్ మరియు శ్రీముఖి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ వేసవిలో కుటుంబ సమేతంగా చూడదగ్గ క్లీన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రాబోతోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























