మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన డెకాయిట్

Dacoit Joins the $1 Million Club

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘డెకాయిట్’ ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ చిత్రం విడుదలైన అతి తక్కువ సమయంలోనే ప్రతిష్టాత్మకమైన 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిన్నటి (ఏప్రిల్ 14, 2026) వసూళ్లతో ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ల మార్కును అధికారికంగా దాటింది. అడివి శేష్ కెరీర్‌లో ఇది వరుసగా మూడో మిలియన్ డాలర్ సినిమా. గతంలో ఆయన నటించిన ‘మేజర్’,’హిట్ 2 చిత్రాలు కూడా ఈ మైలురాయిని అందుకున్నాయి. ఈ హ్యాట్రిక్ విజయంతో అమెరికా మార్కెట్‌లో శేష్ తన సత్తాను మరోసారి చాటుకున్నారు.

కేవలం 5 రోజుల్లోనే (ప్రీమియర్స్ మరియు వీకెండ్‌తో కలిపి) ఈ మార్కును చేరుకోవడం గమనార్హం. మొదటి రోజునే ఈ చిత్రం అక్కడ $575K వసూలు చేసి అద్భుతమైన ఆరంభాన్ని పొందింది.

ప్రస్తుతం ఈ సినిమా మొత్తం ఓవర్సీస్ వసూళ్లు 1.2 మిలియన్ డాలర్ల పైనే ఉన్నట్లు సమాచారం. బ్రేక్ ఈవెన్ కావడానికి మరో $300K – $400K వసూలు చేయాల్సి ఉంది.

అడివి శేష్‌కు ఉన్న క్రేజ్ మరియు సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ కారణంగా ఓవర్సీస్ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ చిత్రం మరిన్ని లాభాలను గడించే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.