బ్రేక్ ఈవెన్ దిశగా రాకాస

Rakasa 10-Day Box Office Collections

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన హారర్ కామెడీ చిత్రం ‘రాకాస’ బాక్సాఫీస్ వద్ద పది రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం 10వ రోజున (ఆదివారం) బాక్సాఫీస్ వద్ద మంచి పుంజుకుంది.నిన్న ఈసినిమా సుమారు రూ. 1.50 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. మొత్తం వరల్డ్ వైడ్ గ్రాస్ (10 రోజుల్లో): దాదాపు రూ. 22.60 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆటు ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ చిత్రం ఇప్పటికే $350K – $400K మార్కును చేరుకుని నిలకడగా రాణిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా దాదాపు రూ.12 కోట్ల రేంజ్‌లో షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం క్లీన్ హిట్ స్టేటస్ అందుకోవాలంటే మరో రూ. 1.5 – 2 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మానస శర్మ దర్శకత్వంలో, నిహారిక కొణిదెల నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా, విడుదలైన మొదటి వారం అద్భుతమైన వసూళ్లను సాధించింది. ముఖ్యంగా యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ హారర్ కామెడీకి బ్రహ్మరథం పట్టారు. అయితే, రెండో వారంలో ‘డెకాయిట్’ వంటి పెద్ద సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ, వీకెండ్‌లో ‘రాకాస’ తన సత్తాను చాటుకుంది.

ప్రస్తుతం ఈ చిత్రం లాభాల్లోకి చేరే దిశగా దూసుకుపోతోంది. తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒక విజయవంతమైన చిన్న చిత్రంగా నిలువనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.