రేసుగుర్రం రీ-రిలీజ్ : ఫస్ట్ డే అదిరిపోయే వసూళ్లు

Superb Day 1 Collections for Race Gurram Re-Release

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రీ-రిలీజ్ అయిన ‘రేసుగుర్రం’ బాక్సాఫీస్ వద్ద తన సత్తాను మరోసారి చాటింది. 12 ఏళ్ల తర్వాత మళ్ళీ థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, మొదటి రోజున రెండు రాష్ట్రాల్లో (AP & TG) అద్భుతమైన వసూళ్లను రాబట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ కావడంతో, అటు అభిమానులు ఇటు సాధారణ ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ‘రేసుగుర్రం’ రీ-రిలీజ్ మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా 3.34 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ముఖ్యంగా నైజాం మరియు వైజాగ్ ప్రాంతాల్లో చాలా చోట్ల షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి.

శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం ‘కిల్ బిల్ పాండే’ పాత్ర ఇప్పటికీ థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయిస్తోంది. తమన్ అందించిన సంగీతం మరియు బన్నీ డాన్స్ మూమెంట్స్ థియేటర్లను హోరెత్తించాయి. ఇప్పటికే టీవీల్లో అనేక సార్లు వచ్చిన ఈసినిమా ఇప్పుడు రీ-రిలీజ్ అయి ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం అల్లు అర్జున్ బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపించింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.