వరుణ్ తేజ్ – డైరెక్టర్ మెర్లపాక గాంధీ కాంబినేషన్‌లో వస్తున్న కొరియన్ కనకరాజ్ చిత్రం నుండి ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలోని మొదటి సింగిల్ ‘కమ్సామ్నిదా’ ఏప్రిల్ 11న విడుదల కాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. “హుక్ లైన్ డిస్కషన్స్ పూర్తయ్యాయి.. ఫైనల్‌గా ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది” అంటూ చిత్ర యూనిట్ స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ కంపోజర్ ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ పాటకు సెన్సేషనల్ సింగర్ సిడ్ శ్రీరామ్ తన గొంతును అందించారు. కొరియన్ భాషలో ‘కమ్సామ్నిదా’ అంటే ‘ధన్యవాదాలు’ అని అర్థం.కొరియన్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుండగా కమెడియన్ సత్య కీలక పాత్రలో కనిపించనున్నాడు.
యూవీ క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. తమన్ మ్యూజిక్, సిడ్ శ్రీరామ్ వాయిస్, తోడైతే ఈ సాంగ్ చార్ట్‌బస్టర్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జూలైలో సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























