గాయపడ్డ సింహం నుంచి ధర్మగా జేడి చక్రవర్తి గ్లింప్స్ రిలీజ్

Glimpse of J. D. Chakravarthy as Dharma from Gayapadda Simham Out Now

తరుణ్ భాస్కర్ మోడరన్ ఎంటర్‌టైనర్ గాయపడ్డ సింహం అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ను సృష్టిస్తోంది. కొత్త దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్ పతాకాలపై పవన్ సాదినేని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మేకర్స్ ఇప్పుడు మరొక కీలక పాత్ర.. జేడి చక్రవర్తి బ్రూటల్ ధర్మగా పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అతని పేరుకు తగినట్లుగా గ్లింప్స్ చిల్లింగ్, స్టైలిష్ గా వుంది. నల్లటి కళ్లజోడు, బంగారు గొలుసుతో అతని లుక్ హుందాగా, ఆకట్టుకునే రెట్రో-గ్యాంగ్‌స్టర్ వైబ్‌ను కలిగిస్తోంది.

సత్య లాజిస్టిక్స్ అనే కంపెనీతో ముడిపడి ఉన్న అక్రమ రవాణా, డ్రగ్స్, ఆయుధాలకు సంబంధించిన ధర్మ కార్యకలాపాలను ఈ గ్లింప్స్ సూచిస్తుంది. ఒక అనుచరుడి సుధీర్గ డైలాగ్ ని ధర్మ మధ్యలోనే ఆపి, ‘ఆడి మోనో లాగ్ మొత్తం చెప్పే వరకూ వెయిట్ చేస్తారా.. ఎసేయండి’ అని ధర్మ చెప్పడం డార్క్ హ్యుమర్ తో క్యారెక్టర్ ఇంటన్సిటీని ప్రజెంట్ చేస్తోంది.

జేడీ చక్రవర్తి బ్రూటల్ మేకోవర్, ప్రజెన్స్, రెట్రో ఫ్లేర్ ‘బ్రూటల్ ధర్మ’ను ప్రత్యేకంగా నిలబెట్టాయి, ఇది సినిమా ప్రధాన హైలైట్‌లలో ఒకటిగా ఖచ్చితంగా ఉంటుంది.

ఈ చిత్రానికి విద్యా సాగర్ చింత ఛాయాగ్రహణాన్ని నిర్వహించగా, స్వీకర్ అగస్తి సంగీతాన్ని అందించారు, విప్లవ్ నిషాదం ఎడిటర్. చంద్రిక గొర్రెపాటి ప్రొడక్షన్ డిజైనర్. ఈసినిమా మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.