ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన 44వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఆయన చేస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘AA22xA6’ (వర్కింగ్ టైటిల్) అధికారిక టైటిల్ పోస్టర్‌ను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నారు. “Brace for the BlAAst” అంటూ మేకర్స్ విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తుంటే, సినిమా చాలా ఇంటెన్స్‌గా ఉండబోతోందని అర్థమవుతోంది. ఒక భీకరమైన జంతువు లేదా ఒక వింత జీవికి సంబంధించిన గోర్లు ఉన్న చేతిని పోస్టర్‌లో చూపించారు. ఇది ఒక ఫాంటసీ లేదా మైథలాజికల్ టచ్ ఉన్న యాక్షన్ డ్రామా అనే ఊహాగానాలకు బలాన్నిస్తోంది. అంతేకాదు, ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా నాలుగు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారని, ఒకే వంశానికి చెందిన నాలుగు తరాల కథగా ఇది సాగుతుందని ఫిల్మ్ నగర్ టాక్.
ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే కథానాయికగా నటిస్తున్నారు. ఆమె ఈ చిత్రంలో ఒక పవర్‌ఫుల్ వారియర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌కు తోడు, అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవ్వడం ఖాయమని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు రాబోయే టైటిల్ కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే గత కొంత కాలంగా పెద్ద సినిమాల టైటిల్ అఫిషియల్ గా రిలీజ్ చేసే ముందే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.కానీ AA22xA6 ఈసినిమా కు సంబంధించిన టైటిల్ మాత్రం ఇప్పటివరకు ఎక్కడా రివీల్ కాకపోవడం విశేషం.ఎలాంటి లీకులు లేకుండా టీం చాలా జాగ్రత్తలు తీసుకుంటుండడంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























