బ్యాడ్ బాయ్ కార్తీక్ ట్రైలర్ రిలీజ్

Trailer of Bad Boy Karthik Out Now

హీరో నాగ శౌర్య, రామ్ దేశినా (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ చిత్రంతో మాస్ అవతార్ తో రాబోతున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్ పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మించిన ఈ చిత్రం, సూపర్ హిట్ పాటలు , శౌర్యను మునుపెన్నడూ ఇంటెన్స్ గా చూపించిన పవర్-ప్యాక్డ్ టీజర్ తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ నెల 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా మేకర్స్ ఈరోజు థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నరేష్ వీకే పాత్ర దేవుడిని ప్రార్థిస్తూ.. ప్రమాదకరమైన వ్యక్తుల అణచివేతలో ఇబ్బందులు పడుతున్న నేపథ్యాన్ని ప్రజెంట్ చేస్తుంది. ఆ సమయంలో ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’ అనే రగ్గ్డ్, తన రూల్స్ తో జీవించే పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఎంట్రీ అదిరిపోతుంది. విలన్‌పై అతను ఎలా పోరాడుతాడు, అమాయకులని ఎలా కాపాడుతాడు అన్నదే కథలో ప్రధానాంశం.

నాగ శౌర్య ఫుల్ మాస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యాక్షన్ సన్నివేశాలతో పాటు, తనలోని వేరియేషన్స్‌ అద్భుతంగా వున్నాయి. ముఖ్యంగా సాయి కుమార్ తో వచ్చే ఫన్ సీన్స్‌లో అతని కామిక్ టైమింగ్ ఆకట్టుకుంటుంది. ట్రైలర్ చివర్లో శౌర్య లార్డ్ లక్ష్మీ నరసింహ స్వామి ప్రజెన్స్ లో కనిపించడం గూస్‌బంప్స్ ఇచ్చేలా ఉంటుంది.

హీరోయిన్‌గా విధి తన చార్మ్‌తో ఆకట్టుకోగా, విలన్ పాత్రలో సముద్రఖని పవర్ ఫుల్ గా కనిపించారు. ఇక నరేష్ వీకే ఎమోషనల్ పెర్ఫార్మెన్స్‌తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అలాగే మైమ్ గోపీ, శ్రీదేవి విజయకుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ ట్రైలర్‌లో ఆకట్టుకున్నారు.

సినిమా మాస్ యాక్షన్, డ్రామా, రొమాన్స్, కామెడీ అన్నీ కలిపిన పూర్తి ఎంటర్టైనర్‌గా రానుందని ట్రైలర్ ప్రామిస్ చేస్తోంది. దర్శకుడు రమేష్ ఈ సినిమాను కమర్షియల్ ప్యాకేజీగా మలిచాఋ. సినిమాటోగ్రఫీని రసూల్ ఎల్లోర్ అందంగా చూపించగా, హారిస్ జయరాజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు మంచి ఎలివేషన్ ఇచ్చింది. ఎడిటింగ్‌లో కొటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌లో రామాంజనేయులు చక్కని పనితీరు కనబరిచారు,

మొత్తానికి ట్రైలర్ మంచి ఇంపాక్ట్‌ను క్రియేట్ చేస్తూ, సినిమా పై అంచనాలను పెంచింది. జీ స్టూడియోస్ ఈ సినిమా థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులను దక్కించుకోవడం ప్రాజెక్ట్‌పై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.