అక్కినేని నాగచైతన్య నటిస్తున్న 24వ సినిమా వృషాకర్మ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రేపు ఈసినిమా కొత్త షెడ్యూల్ రాజస్థాన్ లో ప్రారంభం కానుంది. ఇందులో భారీ యాక్షన్ సీన్లను చిత్రీకరించనునున్నారు. ప్రారంభించబోతోంది. ఈ షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా కొంతమంది విదేశీ స్టంట్ మాస్టర్లను కూడా రప్పించినట్లు సమాచారం.ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇటీవల విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. సినిమాలోని విజువల్స్ ప్రేక్షకులను అబ్బురపరిచి, సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఈ చిత్రంలో నాగచైతన్య అర్జున్ అనే ట్రెజర్ హంటర్ పాత్రలో కనిపిస్తుండగా, మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ‘లాపతా లేడీస్’ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ విలన్‌గా, సీనియర్ నటుడు జయరామ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ లోక్ నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ భారీ అడ్వెంచర్ థ్రిల్లర్‌ను ఈ ఏడాది ద్వితీయార్థంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.ఈసినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు వున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























