అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’ విడుదల వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ సినిమా మే 1, 2026న విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు దానిని జూన్ నెలకు మార్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ చిత్రం ‘పెద్ది’ ఏప్రిల్ 30, 2026న విడుదలవుతోంది. ‘పెద్ది’ వంటి పెద్ద సినిమా విడుదలైన మరుసటి రోజే ‘లెనిన్’ రావడం వల్ల బాక్సాఫీస్ వద్ద ఇబ్బందులు ఎదురవుతాయని, అలాగే అఖిల్ మరియు రామ్ చరణ్ మధ్య ఉన్న మంచి అనుబంధం దృష్ట్యా చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుంది. ‘పెద్ది’కి తగినంత స్పేస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ‘లెనిన్’ మేకర్స్ వెనక్కి తగ్గారు.
‘లెనిన్’ సినిమా ఇప్పుడు జూన్ 26, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.ఇందులో అఖిల్ అక్కినేని సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. మురళీ కిషోర్ అబ్బూరు ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ మరియు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
అఖిల్ ‘ఏజెంట్’ తర్వాత సుమారు మూడేళ్ల విరామం తీసుకుని చేస్తున్న సినిమా ఇది. జూన్ 26న సోలోగా రావడం వల్ల సినిమాకు మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























