నా సినిమాలకు ప్రశంసలే కాదు డబ్బులు కూడా వస్తాయని పాపం ప్రతాప్ నిరూపిస్తుంది: హీరో తిరువీర్

Thiruveer Confident Paapam Pratap Will Deliver Praise and Revenue

టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ ప్రధాన పాత్రలో, ఎస్.పి. దుర్గ నరేష్ దర్శకత్వంలో రూపొందిన వైవిధ్యభరిత చిత్రం ‘పాపం ప్రతాప్’. కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాకేశ్‌ రెడ్డి గడ్డం, రుద్రదేవ్‌ మదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. వరుస బ్లాక్ బస్టర్స్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్న ఈటీవి విన్‌ ఒరిజినల్‌ ప్రొడక్షన్‌‌ నుంచి రాబోతున్న ఈ సినిమా నుంచి రీసెంట్‌గా రిలీజైన టీజర్‌కు మంచి అప్లాజ్ వస్తోంది. ఇప్పటివరకు ప్రేమలో గెలిచాం.. పెళ్లి తర్వాత ఆ ప్రేమ ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్న ఓ జంట చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందింది. ‘రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవైనా జరిగినా.. ఆ గొడవ వల్ల నా పరువు పోయినా.. గుర్తుపెట్టుకో నీ బతుకు నా చేతిలో చేతబడి బొమ్మేరోయ్‌’ అంటూ హీరో తండ్రి డైలాగ్‌తో ఆసక్తికరంగా టీజర్ ఉంది. థియేటర్లలో ఫన్ రైడ్ చేయించే ఈ నవ్వుల బ్లాక్ బస్టర్‌ను ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో చిత్ర యూనిట్ పాల్గొని సినిమా విశేషాలను పంచుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో తిరువీర్ మాట్లాడుతూ…‘‘నాకు చిన్నప్పుడు సినిమాల గురించి తెలిసింది ఈటీవీ ద్వారానే. ఈరోజు ఈటీవీ విన్‌తో సినిమా చేశా. గతంలోనే వీరాంజనేయులు విహారయాత్ర సినిమా నేను చేయాల్సింది. కానీ అప్పట్లో థియేటర్ సినిమాలే చేయాలని నాకు ఉండింది. ఈ రోజు నా లైనప్ చూస్తే నా నెక్ట్స్ సినిమా ఈటీవీ విన్ నుంచి వస్తోంది. ధైర్యంగా ఉండొచ్చు అనిపిస్తోంది. చాలా షార్ట్ పిరియడ్‌లో ఈటీవీ విన్ మంచి పేరు తెచ్చుకుంది. నరేష్ ఈ కథ పట్టుకుని చాలా తిరిగాడు. అతని కోసమే ఈ సినిమా చేయాలనిపించింది. నరేష్ ఏం చెప్పాడే అది విని ఈ సినిమా చేసుకుంటూ వెళ్లా. నా సినిమాలకు ప్రశంసలు మాత్రమే కాదు.. డబ్బులు కూడా వస్తాయని ఈ సినిమా నిరూపిస్తుంది. ఏప్రిల్ 17న మీకు టీజర్‌ను మించిన ఫన్ ఇస్తుంది. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు మా నాన్న గుర్తొచ్చారు. ఈ సినిమా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూసే సినిమా. థియేటర్లలో కలుద్దాం’’ అని చెప్పారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.