ధురంధర్: ది రివెంజ్ 8 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

Dhurandhar The Revenge 8 days Collections Report

రణవీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఈ సినిమా కేవలం 8 రోజుల్లోనే కనివినీ ఎరుగని రీతిలో వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్ఛర్య పరిచింది. నిన్నటితో ప్రపంచవ్యాప్తంగా 1088 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, అత్యంత వేగంగా వెయ్యి కోట్ల క్లబ్బులో చేరిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రపంచవ్యాప్తంగా 1088 కోట్లు వసూళ్లను రాబట్టగా ఇండియాలో 690 కోట్ల నెట్ వసూళ్లను సొంతం చేసుకుంది. ఇక ఓవర్సీస్ లో అయితే రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురుస్తుంది. అక్కడ ఈసినిమా 8 రోజుల్లో 274 కోట్లు వసూళ్లను రాబట్టుకుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ సాలిడ్ రన్ ను కొనసాగిస్తుంది.

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై థ్రిల్లర్‌లో రణవీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా మరియు అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం నటించడం ఈ సినిమాకు ప్రధాన బలమైంది.ముఖ్యంగా ‘భారత్ మాతా కీ జై’ అనే నినాదంతో సాగే ఈ యాక్షన్ డ్రామాకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.