ఉస్తాద్ కోసం పవన్  రెమ్యునరేషన్ తీసుకోలేదు – నవీన్ యెర్నేని 

Naveen Yerneni says Pawan Kalyan Took No Remuneration for Ustaad Bhagat Singh

‘ఉస్తాద్ భగత్ సింగ్’ మరి కొన్ని గంటల్లో థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో చిత్ర బృందం మీడియా మీట్ నిర్వహించారు. ఈ మీట్ కు డైరెక్టర్ హరీష్ శంకర్ తోపాటు నిర్మాత నవీన్ యెర్నేని , హీరోయిన్లు శ్రీ లీల , రాశి ఖన్నా హాజరయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ మీట్ లో పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం తీసుకున్న పారితోషికంపై నిర్మాత నవీన్ యెర్నేని స్పందించారు. ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ కేవలం నామమాత్రపు అడ్వాన్స్ తప్ప, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదని ఆయన వెల్లడించారు. సినిమా నిర్మాణం సజావుగా సాగాలని, బడ్జెట్ విషయంలో నిర్మాతలకు భారం కలగకూడదనే ఉద్దేశంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు నవీన్ పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్ గారు నిర్మాతల శ్రేయస్సు కోరి ఇలా చేయడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని నవీన్ కొనియాడారు. షూటింగ్ సమయంలో ఆయన ఎప్పుడూ డబ్బు గురించి ప్రస్తావించలేదని నిర్మాత వివరించారు.అలాగే నైజాం లో టికెట్ రేట్ల విషయంపై కూడా అయన స్పందించారు. పెద్దలను కలిసే సమయం లేకపోవడం అలాగే నార్మల్ రేట్లతో ఎలా పెర్పార్మ్ చేస్తుందో చూడాలనుకున్నామని అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ కు తెలంగాణలో నార్మల్ రేట్లే ఉంచామని నవీన్ తెలిపారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.