పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సృష్టించిన బాక్సాఫీస్ ప్రభంజనం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ముందస్తు బుకింగ్స్ లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 18 కోట్ల గ్రాస్ వసూళ్లను ముందస్తు బుకింగ్స్ ద్వారా సాధించింది. నేడు సాయంత్రానికి ఈ ఫిగర్ సులభంగా రూ. 20 కోట్ల మార్కును దాటుతుందని ట్రేడ్ వర్గాల అంచనా.దాంతో మొదటి రోజు ఈసినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కేవలం ‘బుక్ మై షో’ ప్లాట్ఫారమ్లోనే గత 24 గంటల్లో దాదాపు 1.16 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి.ఇక ఉత్తర అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే 3 లక్షల డాలర్ల ($300K) మైలురాయిని దాటి దూసుకుపోతోంది. యూకే మరియు ఆస్ట్రేలియాలో కూడా బుకింగ్స్ జోరుగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక షోలు అలాగే టికెట్ హైక్ ఉండడంతో సినిమాకు అడ్వాంటేజ్ కానుంది.ఈ సమ్మర్ లో వస్తున్న బిగ్ స్టార్ సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు భారీగా వున్నాయి.
హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన 2 గంటల 34 నిమిషాల నిడివి తో థియేటర్లలోకి రానుంది. ఇది యాక్షన్ సినిమాలకు పర్ఫెక్ట్ లెంగ్త్ అని చెప్పవచ్చు. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించడం మరో విశేషం.రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’ వంటి భారీ చిత్రంతో పోటీ ఉన్నప్పటికీ, పవన్ కల్యాణ్ క్రేజ్ తో ఉస్తాద్ భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























