పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి సంబంధించి తెలంగాణ (నైజాం) ప్రేక్షకులకు ఒక రకంగా ఇది తీపి కబురే అని చెప్పాలి. ఈ సినిమాకు నైజాం ప్రాంతంలో టికెట్ ధరల పెంపు లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చినప్పటికీ, తెలంగాణలో మాత్రం చిత్ర యూనిట్ పాత ధరలకే (సాధారణ ధరలకే) సినిమాను ప్రదర్శించాలని నిర్ణయించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సామాన్య ప్రేక్షకులకు మరియు ఫ్యామిలీ ఆడియన్స్‌కు సినిమాను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల రిపీట్ ఆడియన్స్ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ధరల పెంపు లేకపోవడంతో నైజాంలో బుకింగ్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్‌లు మరియు సింగిల్ స్క్రీన్‌లలో అడ్వాన్స్ బుకింగ్ బాగున్నాయి. ఆంధ్రాలో బెనిఫిట్ షోలకు కూడా పెర్మిషన్ రాగ తెలంగాణ లో మాత్రం మార్చి 19న ఉదయం 7:30 లేదా 8:00 గంటల నుండి రెగ్యులర్ షోలు ప్రారంభం కానున్నాయి.నైజాంలో టికెట్ రేట్లు పెంచకపోవడం వల్ల ఓపెనింగ్స్ పరంగా సినిమాకు భారీ అడ్వాంటేజ్ లభించే అవకాశం ఉంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























