బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన కొత్త సినిమా టైటిల్ను మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ అని టైటిల్ పెట్టారు. అయితే ఈ చిత్రానికి ఇప్పుడు ‘మాతృభూమి’ అనే కొత్త పేరును ఖరారు చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఒక కొత్త పోస్టర్ను కూడా విడుదల చేశారు.కొన్నేళ్ల క్రితం గల్వాన్ లోయలో జరిగిన వాస్తవ ఘర్షణల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిత్రాంగద సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
టైటిల్ మార్పునకు గల కారణాలను చిత్ర బృందం అధికారికంగా వెల్లడించనప్పటికీ, దేశభక్తిని ప్రతిబింబించేలా ఉండాలనే ఉద్దేశంతో ‘మాతృభూమి’ అనే పేరును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.త్వరలోనే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించనున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























