సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు దర్శకుడు హరీష్ శంకర్ క్షమాపణలు చెప్పారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్ర ప్రమోషన్స్ సమయంలో, పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్టుకు హరీష్ శంకర్ స్పందించారు. ఆ ట్వీట్ మహేష్ బాబు రికార్డులను బద్దలు కొట్టాలనే అర్థం వచ్చేలా ఉండటంతో, అది మహేష్ బాబు అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది.దీనిపై వారు హరీష్ శంకర్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ వివాదం ముదరడంతో హరీష్ శంకర్ స్పందిస్తూ, తాను షూటింగ్ మరియు సెన్సార్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఆ ట్వీట్‌ను పూర్తిగా చదవకుండానే, కేవలం అభిమాని ఉత్సాహాన్ని చూసి పొరపాటున రిప్లై ఇచ్చానని పేర్కొన్నారు. తనకు మహేష్ బాబు అంటే ఎంతో గౌరవమని, ‘పోకిరి’ సినిమా గురించి కూడా తాను గతంలో పాజిటివ్‌గా మాట్లాడానని గుర్తుచేశారు.
రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమా పెద్ద రికార్డులు సృష్టించాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. తన రిప్లై వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే బేషరతుగా క్షమాపణలు కోరుతున్నానని ఆయన వెల్లడించారు. కావాలని ఇలాంటి వివాదాలు చేసే వ్యక్తిని తాను కాదని ఆయన స్పష్టం చేశారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























