రికార్డు ధరకు అమ్ముడైన వృషకర్మ థియేట్రికల్స్ రైట్స్

Sithara Entertainments Secures ‘Vrushakarma’ Theatrical Rights for a Whopping Price

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మిస్టికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ బిజినెస్ పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ సుమారు 45 కోట్ల రూపాయల రికార్డు ధరకు కైవసం చేసుకున్నారు. నాగ చైతన్య కెరీర్‌లో ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో ఇదే అత్యధిక థియేట్రికల్ బిజినెస్ కావడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాకు విదేశీ మార్కెట్‌లో కూడా భారీ డిమాండ్ ఉంది. ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులు రికార్డు స్థాయిలో 7 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.రీసెంట్ గారిలీజైన ఈసినిమా ఈ గ్లిమ్ప్స్ ఈ రేంజ్ బిజినెస్ జరుగడానికి ప్రధాన కారణమని చెప్పొచ్చు.

విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మైథికల్ థ్రిల్లర్ లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు స్పార్ష్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. భారీ విఎఫ్ఎక్స్ తో రానున్న ఈసినిమాకు అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తుండగా ఎస్విసీసీ , సుకుమార్ రైటింగ్స్ భారీ బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నాయి. మే లో ఈసినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.