నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ‘ది ప్యారడైజ్’ చిత్ర బృందం నేడు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ లిరికల్ వీడియోను తాజాగా విడుదల చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మాస్ ఇంట్రడక్షన్: ఈ పాట సినిమాలో నాని ఇంట్రడక్షన్ సాంగ్‌గా రానుంది. 1960ల నాటి గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ పాటను అత్యంత భారీ సెట్‌లో వందలాది మంది డ్యాన్సర్ల మధ్య చిత్రీకరించారు.
అనిరుధ్ మ్యాజిక్: రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ పాటకు అదిరిపోయే మాస్ బీట్స్ అందించారు. సుధన్ మాస్టర్ నేతృత్వంలో నాని చేసిన ఎనర్జిటిక్ స్టెప్పులు ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.ముఖ్యంగా నాని చేసిన హుక్ స్టెప్ హైలైట్ నిలిచింది.ఈ ఒక్క లిరికల్ వీడియోతోనే తెలిసిపోతుంది నాని ఈసినిమాలో తన విశ్వరూపం చూపించబోతున్నాడని. ఇప్పటికే విడుదలైన ప్రోమోకు మంచి రెస్పాన్స్ రాగా, సాంగ్ కూడా అంచనాలను అందుకుంది. ఓవరాల్ గా ది ప్యారడైజ్ ఫస్ట్ సింగిల్ చార్ట్ బస్టర్ అనిపించుకుంది.
‘దసరా’ బ్లాక్ బస్టర్ తర్వాత నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటిస్తుండగా, సంపూర్ణేష్ బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























