బ్యాండ్ మేళం టీజర్ రిలీజ్

Much-Awaited Band Melam Teaser Drops Online

కోన వెంకట్ సమర్పణలో హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్యాండ్ మేళం’ అధికారిక టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. సతీష్ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ చిత్రం పూర్తిస్థాయి గ్రామీణ నేపథ్యంలో సాగే వినోదాత్మక చిత్రంగా కనిపిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ టీజర్ , హీరోయిన్ శ్రీదేవి “నాకు త్వరగా పెళ్లి చేసేయ్ నాన్న, ఈ చదువులు నావల్ల కావు” అంటూ చేసే అల్లరితో సరదాగా ప్రారంభమవుతుంది . ఒక పక్క ఊరంతా హీరో టాలెంట్ గురించి మాట్లాడుకుంటుంటే, మరోపక్క అతని తండ్రి “ఈ టాలెంట్‌కు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి ఫ్రీగా ఇల్లు కూడా ఇస్తారు” అంటూ సెటైర్లు వేయడం నవ్వు తెప్పిస్తుంది . టీజర్‌లో చూపించిన డైలాగులు, ముఖ్యంగా “కుక్కలకి చలికాలంలో ఎర్రి లేసినట్లు, నెలకోసారి ఇట్లా ఎర్రి పనులు చేయకుండా ఉండలేరా మీరూ ? వంటివి యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి.

సాంకేతికంగా ఈ సినిమా టీజర్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. విజయ్ బుల్గానిన్ అందించిన నేపథ్య సంగీతం రిఫ్రెషింగ్ గా అనిపించింది. ” అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప,హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో అనే ఫేమస్ డైలాగ్ ఆసక్తిని కలిగించింది.

టీజర్ చూస్తుంటే ఈసినిమాలో హర్ష్ రోషన్ తనదైన కామెడీ టైమింగ్‌తో ఈ సినిమాలో మెప్పించేలా ఉన్నాడు.ఇక ఆల్రెడీ కోర్ట్ సినిమాతో హిట్ పెయిర్ అనిపించుకున్న హార్ష్ రోషన్ , శ్రీదేవి ఈ ‘బ్యాండ్ మేళం’తో కూడా అదే ఫలితాన్ని రీపీట్ చేసేలా వున్నారు. మార్చి 13నఈసినిమా థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.