ప్రముఖ సినీ తారలు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ వివాహం గురించి వస్తున్న వార్తలపై అధికారికంగా స్పందించారు. అభిమానులు తమ ఇద్దరి పేర్లను కలిపి ఎంతో ప్రేమతో ‘విరోష్’ అని పిలుచుకుంటున్నారని, ఆ నిర్ణయాన్ని గౌరవిస్తూ తమ పెళ్లి వేడుకకు ‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వారు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమ పట్ల అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాలతో వెండితెరపై అలరించిన ఈ జంట, ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయ్పుర్లో వివాహం చేసుకోనున్నారు. అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లో ఘనంగా వివాహ విందు వేడుకను నిర్వహించనున్నారు. తమ జీవితంలోని ఈ ముఖ్యమైన ఘట్టంలో అభిమానులను కూడా భాగస్వాములను చేస్తూ వారు ఈ పోస్ట్ పంచుకున్నారు.
ఇక ఈ జంట, పెళ్లి వేడుక కోసం రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా వారు విమానాశ్రయానికి చేరుకున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























