నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’ విడుదల తేదీ మార్పుపై కొద్దీ రోజులు గా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ముందుగా ఈ చిత్రాన్ని 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు. అయితే, సినిమా షూటింగ్ పనుల్లో జరుగుతున్న జాప్యం మరియు భారీ విజువల్ ఎఫెక్ట్స్ పనుల కారణంగా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈరోజు మేకర్స్ ఈ రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చారు.ఆగస్టు 21వ తేదీన ఈసినిమా థియేటర్లలోకి రానున్నట్లు ప్రకటించారు.ఈసమాచారం నాని అభిమానులకు కొంత నిరాశ కలిగించినప్పటికీ సినిమా నాణ్యత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నాని-శ్రీకాంత్ ఓదెల కలయికలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ చిత్రంలో నాని ‘జడల్’ అనే విభిన్నమైన మరియు మాస్ పాత్రలో కనిపించనున్నాడు.
అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మోహన్ బాబు, సోనాలి కుల్కర్ణి, రాఘవ్ జుయల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే సంపూర్ణేశ్ బాబు ‘బిర్యానీ’ అనే వైవిధ్యమైన పాత్రలో నటిస్తుండటం విశేషం. సికింద్రాబాద్ స్లమ్ నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో నాని లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. విడుదల తేదీ మారినప్పటికీ, ఈ వాయిదా సినిమాకు మరింత మేలు చేస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఈనెల 22న ఈసినిమానుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































