వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు పుట్టినరోజు సందర్భంగా, ‘పెద్ది’ చిత్ర యూనిట్ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ షూటింగ్ సెట్స్ నుండి ఒక ఆసక్తికరమైన వర్కింగ్ స్టిల్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో జగపతి బాబు ‘అప్పలసూరి’ అనే ఊరమాస్ మరియు ఇంటెన్సివ్ పాత్రలో నటిస్తున్నారు. తాజా ఫోటోలో దర్శకుడు బుచ్చిబాబు సానా ఆయనకు ఒక కీలకమైన సన్నివేశాన్ని వివరిస్తుండగా, జగపతి బాబు తన మేకోవర్‌లో (వయసు పైబడిన ముదుసలి లుక్, దారంతో కట్టిన కళ్లద్దాలతో) చాలా సహజంగా కనిపిస్తున్నారు.ఈ రోల్ జగపతి కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలువనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో జగపతి బాబు పాత్ర ఒక ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్ర బృందం పేర్కొంది.ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సహకారంతో వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. ముందుగా మార్చిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదావేశారు. రీసెంట్ గా కొత్త డేట్ ను కూడా ప్రకటించారు. ఏప్రిల్ 30, 2026న గా ప్రేక్షకుల ముందుకు రానుంది.త్వరలోనే సెకండ్ సింగిల్ ను కూడా రిలీజ్ చేయనున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























