యువ నటి శ్రీలీల తన ఎంబీబీఎస్ (MBBS) విద్యను విజయవంతంగా పూర్తి చేసి డాక్టర్ పట్టా పొందారు. సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, చదువుకు ప్రాధాన్యతనిస్తూ ఆమె తన లక్ష్యాన్ని చేరుకున్నారు. తన తల్లి డాక్టర్ స్వర్ణలత నుంచి స్ఫూర్తి పొంది వైద్య వృత్తిని ఎంచుకున్న ఆమె, షూటింగ్ విరామాల్లో కూడా చదువుకు సమయం కేటాయించేవారట. ఫైనల్ ఇయర్ పరీక్షల కోసం ఆమె సినిమాల నుంచి కొంతకాలం విరామం తీసుకుని మరీ కష్టపడ్డారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సెట్స్‌లో ఖాళీ సమయం దొరికినప్పుడు థియరీ చదువుతూ, విరామాల్లో హాస్పిటల్‌కు వెళ్లి ప్రాక్టికల్స్ నేర్చుకున్నట్లు ఆమె గతంలో వెల్లడించారు. ఇప్పుడు అధికారికంగా డాక్టర్ కావడంతో అభిమానులు మరియు సినీ ప్రముఖులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు. చదువు పూర్తి కావడంతో ఇకపై ఆమె మళ్లీ వరుస సినిమాలతో పూర్తి స్థాయిలో బిజీ కానున్నారు.
ఇక ప్రస్తుతం శ్రీలీల తమిళంలో ధనుష్ 55 వ సినిమాలో నటిస్తుంది. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో హీరోయిన్ గా నటించింది. ఈసినిమా మార్చి 26న విడుదలకానుంది. ఈసినిమా విజయం తనకు కీలకం కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























