సంక్రాంతికి చివరి సినిమాగా వచ్చిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’ ఇప్పుడు మిగితా సంక్రాంతి సినిమాలకన్నా ముందుగా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. శర్వానంద్ హీరోగా నటించిన ఈసినిమా ఈనెల 14న విడుదలై బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.భారీ పోటీ మధ్య కూడా ఈసినిమా 30కోట్లకుపైనే వసూళ్లను రాబట్టి శర్వాకు విజయాన్ని అందించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ లోకి రానుంది. ఫిబ్రవరి 4 తెలుగుతోపాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ బాషల్లోకూడా అందుబాటులోకి రానుంది. మరి థియేటర్లలో అదరగొట్టిన ఈసినిమా ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఇద్దరమ్మాయిల (సాక్షి వైద్య, సంయుక్త) మధ్య నలిగిపోయే గౌతమ్ అనే యువకుడి పాత్రలో శర్వానంద్ తన మార్క్ కామెడీతో ఆకట్టుకున్నారు. గతంలో ప్రేమించిన అమ్మాయి, ప్రస్తుతం పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మధ్య హీరో ఎదుర్కొన్న ఇబ్బందులు, ఈ క్రమంలో హీరో తండ్రి (నరేష్) వైవాహిక జీవితంలో తలెత్తిన చిక్కులను దర్శకుడు రామ్ అబ్బరాజు ఎంతో వినోదాత్మకంగా తెరకెక్కించారు.
ఇందులో సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్లుగా నటించగా.. నరేష్, సత్య, సునీల్, వెన్నెల కిశోర్ వంటి సీనియర్ కమెడియన్లు తమ కామెడీ టైమింగ్‌తో సినిమాను రంజింపజేశారు.ఈసినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























