సంబరాల ఏటిగట్టు క్లైమాక్స్ ఓ రేంజ్ లో

Climax Shoot in Progress for Sambarala Yeti Gattu

సాయి దుర్గా తేజ్ హీరోగా రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటిగట్టు’. ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర బృందం ప్రస్తుతం సినిమాలోని అత్యంత కీలకమైన మరియు ఉత్కంఠభరితమైన క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. దీని కోసం భారీ సెట్లను నిర్మించారు. ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని, యాక్షన్ ప్రియులకు ఇది ఒక విజువల్ ఫీస్ట్‌లా ఉంటుందని సమాచారం.

1947 కాలం నాటి రస్టిక్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగుతోంది. అణచివేతకు గురవుతున్న ప్రజల కోసం పోరాడే ఒక పవర్‌ఫుల్ హీరో కథగా దీనిని దర్శకుడు రోహిత్ కె.పి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘అసుర ఆగమనం’ గ్లింప్స్ సినిమాలోని ఇంటెన్సిటీని చాటిచెప్పింది.

ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో మెరుస్తున్నారు. శ్రీకాంత్ ‘బ్రిటిషు’ అనే వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. ‘హనుమాన్’ వంటి సంచలనాన్ని అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సుమారు 150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.ఇప్పటికే 75 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్-ఇండియా చిత్రాన్ని త్వరలోనే థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నద్ధమవుతున్నారు.మరి సాయి దుర్గా తేజ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.