విజయ్ దేవరకొండ మరియు దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామా VD 14 కు ‘రణబాలి’ అనే పవర్ ఫుక్ టైటిల్‌ను ఖరారు చేశారు. నిన్న (జనవరి 26, 2026) రిపబ్లిక్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసింది. ఈ పవర్ ఫుల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ గ్లింప్స్ 19వ శతాబ్దపు (1854-1878) నాటి బ్రిటీష్ పాలనలోని చీకటి రోజులను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. హిట్లర్ మారణహోమం కంటే ఘోరమైన అకృత్యాలు భారతదేశంలో జరిగాయని, వాటిని ఎదిరించిన ఒక ‘యోధుడు’ కథే ఈ ‘రణబాలి’ అని వీడియో ద్వారా అర్థమవుతోంది. గ్లింప్స్ చివరలో విజయ్ దేవరకొండ గుర్రంపై స్వారీ చేస్తూ, ఒక బ్రిటీష్ అధికారిని రైల్వే ట్రాక్ మీద ఈడ్చుకుంటూ వెళ్లే సన్నివేశం ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. విజయ్ ఇందులో ఎన్నడూ చూడని విధంగా చాలా రఫ్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు.
ఈ సినిమాలో రష్మిక మందన్న ‘జయమ్మ’ అనే కీలక పాత్రలో నటిస్తుండగా, ‘ది మమ్మీ’ ఫేమ్ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ విలన్‌గా కనిపించనున్నారు. అజయ్-అతుల్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విజువల్స్ కు మరింత బలాన్ని ఇచ్చింది. కేవలం గ్లింప్స్‌తోనే సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లిన చిత్ర యూనిట్, ఈ సినిమాను 2026, సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ‘టాక్సీవాలా’ తర్వాత విజయ్-రాహుల్ కాంబోలో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























