ఈ సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు హీరో శర్వానంద్. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈసినిమాను నిర్మించారు. సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు.మరో హీరో శ్రీ విష్ణు క్యామియో రోల్ లో మెరిశాడు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సంక్రాంతి విన్నర్ గా నిలిచి హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సంక్రాంతి విన్నర్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో టీం అందరినీ షీల్డ్స్ అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసందర్బంగా హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. నారీ నారీ నడుమ మురారి సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ చాలా థాంక్స్. ఈ టైటిల్ అనగానే నాకు టెన్షన్ వచ్చింది. బాలయ్య బాబు గారి ప్రతిష్టాత్మకమైన సినిమా అది. అలాంటి టైటిల్ పెట్టాలంటే నిజంగా ధైర్యం ఉండాలి. అనిల్ గారు శర్వా సాయి ఆ ధైర్యం చేశారు. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. అనిల్ గారికి హిట్స్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన చాలా మంచి మనిషి. అందరికి బిగ్ కంగ్రాజులేషన్స్.
శర్వా నాకు ఎప్పటినుంచో తెలుసు. ఆయన చాలా మర్యాదగా మాట్లాడుతారు. చాలా డిఫరెంట్ కథలు చేస్తారు. ఆయన ప్రతి సినిమాలో ఒక డిఫరెంట్ పాయింట్ ఉంటుంది. ఆయన ప్రతి సంవత్సరం పండగకి రావాలని కోరుకుంటున్నాను. ఆయన వస్తే ప్రతి సినిమా హిట్ అవుతుంది. ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ థాంక్యూ.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























