నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ #NBK111 ఫైనల్ గా మరోసారి క్లారిటీ వచ్చింది. గత ఏడాది చివర్లోనే ఈసినిమా లాంచ్ అయ్యింది.బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో భారీ చారిత్రక నేపథ్యం ఉన్న యాక్షన్ డ్రామాగా ఈసినిమాను ప్లాన్ చేశారు. హీరోయిన్ గా నయనతార ను తీసుకున్నారు. అయితే జనవరి లోనే సెట్స్ మీదకు వెళ్లాల్సివుండగా చివరి నిమిషంలో స్క్రిప్ట్ లో మార్పులు జరిగాయి. దాంతో ఈసినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే అలాంటిదేమి లేదని సమాచారం. తాజాగా ఫైనల్ స్క్రిప్ట్ నరేషన్ కూడా జరిగిపోయిందట. బాలకృష్ణ కు స్క్రిప్ట్ పక్కాగా నచ్చడంతో సినిమాకు ఓకే చెప్పరట. ఫిబ్రవరి లేదా మార్చి లో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.మరి ఇప్పుడు కథ మారడంతో హీరోయిన్ ను మారుస్తారో లేదో తెలియల్సి వుంది. త్వరలోనే ఈసినిమా గురించి అఫిషియల్ అప్డేట్ రానుంది.
ఇక ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత బాలకృష్ణ – గోపిచంద్ మలినేని కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ ఎస్.ఎస్. సంగీతాన్ని అందిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























