విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సుమతీ శతకం. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్ట, JDV ప్రసాద్, ఆకెళ్ళ గోపి కృష్ణ, కిరణ్ విజయ్, మిర్చి కిరణ్, నెల్లూరు నీరజ, మలక్పేట్ శైలజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి నహిద్ మహమ్మద్ ఎడిటింగ్ చేయగా ఎస్ హలేష్ సినిమాటోగ్రాఫర్ గా చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ఫస్ట్ లుక్ & టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫిబ్రవరి 6వ తేదీన మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ఈ చిత్రం నుండి వచ్చిన పాట “సుమతి సుమతి…”. కృష్ణ మాదినేని రాసిన ఈ పాటకు గోల్డ్ దేవరాజ్ స్వరాన్ని అందించగా సుభాష్ ఆనంద్ సంగీతం ఈ పాటను మరింత వినసంపుడిగా మార్చింది.
“నా కుట్టీ కుట్టీ సుమతీ, నా చిట్టీ చిట్టీ సుమతీ…” అంటూ సాగిన ఈ సాంగ్ విజువల్స్ చూస్తే అమర్దీప్ తాను ప్రేమించిన అమ్మాయి గురించి పాడుతున్నట్లు తెలుస్తుంది. అలాగే పాటలోని డాన్స్ స్టెప్స్ కూడా సింపుల్ గా ఉంటూనే సరికొత్తగా ప్రేక్షకులను ఆకర్షించేలా ఉన్నాయి. ముందు ముందు యువత తమ ప్రేయసిని తలుస్తూ పడేలా ఈ పాట చార్ట్ బస్టర్ అవుతుందని అర్థం అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ‘ఎక్కడే ఎక్కడే’ పాట ప్రేక్షకుల పట్ల చక్కటి స్పందనను అందుకుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























