ఓం శాంతి శాంతి శాంతిః ట్రైలర్ రిలీజ్

Om Shanti Shanti Shantihi Official Trailer out now

టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ తరుణ్ భాస్కర్ హీరోగా, ఈషా రెబ్బా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ ఓం శాంతి శాంతి శాంతిః. ట్రైలర్ ఈరోజు ట్రైలర్ ను విడుదలచేశారు మేకర్స్ . మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘జయ జయ జయ జయ హే’ చిత్రానికి అధికారిక రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఏఆర్ సజీవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ట్రైలర్ విషయానికి వస్తే.. గోదావరి జిల్లాల నేపథ్యంతో కూడిన ఒక క్యూట్ అండ్ హ్యూమరస్ రూరల్ కామెడీ డ్రామాగా ఈ సినిమా కనిపిస్తోంది. ఇందులో తరుణ్ భాస్కర్ ‘అంబాటి ఓంకర్ నాయుడు’ అనే చేపల వ్యాపారి పాత్రలో నటించగా, ఈషా రెబ్బా ‘కొండవీటి ప్రశాంతి’ అనే భార్య పాత్రలో కనిపించారు. అహంకారి అయిన భర్త, ఓర్పు కలిగిన భార్య మధ్య సాగే ఆహ్లాదకరమైన పోరాటమే ఈ చిత్ర కథాంశం. ట్రైలర్‌లో తరుణ్ భాస్కర్ డైలాగ్ డెలివరీ, కామెడీ సంభాషణలు హైలైట్ అయ్యాయి.

బ్రహ్మాజీ కీలక పాత్రలో కనిపించనుండగా ఈ చిత్రానికి జే క్రిష్ సంగీతాన్ని అందించారు. ఎస్ ఒరిజినల్స్ మరియు మూవీ వెర్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఆరోగ్యకరమైన హాస్యంతో కూడిన ఒక మంచి కుటుంబ కథా చిత్రం కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ ఓం శాంతి శాంతి శాంతిః ఒక మంచి ఆప్షన్ కాబోతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.