మెగాస్టార్ చిరంజీవి , దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను సాధించి మెగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా తొలి వారంలో ప్రపంచ వ్యాప్తంగా 292 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈరోజు తో 300కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ వుంది.చిరంజీవి కెరీర్ లో ఇదే మొదటి 300కోట్ల సినిమా కానుంది. అటు అనిల్ రావిపూడి వరుసగా రెండో సారి 300కోట్ల క్లబ్ లో చేరనున్నాడు. అంతేకాదు వీరిద్దరి కెరీర్ లో ఈసినిమా హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. పండగ సెలువులు కావడం అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో మన శంకర వర ప్రసాద్ గారు కేవలం 6రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి బయ్యర్లకు భారీ లాభాలను తీసుకొస్తుంది. ఫుల్ రన్ లో 350కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.
అటు ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ మెగా చిత్రం ప్రభంజనం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ఈ సినిమా 2.8 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి చిరంజీవి కెరీర్లోనే ఓవర్సీస్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. మొత్తం మీద మొదటి వారం ముగిసేసరికి ఓవర్సీస్ నుండి సుమారు రూ. 35.25 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, చిరంజీవి వింటేజ్ ఎనర్జీ మరియు వెంకటేష్ గెస్ట్ రోల్ ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గర చేశాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























