కొరియన్ కనకరాజు గా వరుణ్ తేజ్ … గ్లింప్స్‌ రిలీజ్

Korean Kanakaraju Title Glimpse out now

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో తన 15వ సినిమా చేస్తున్నాడు. ఈరోజు వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.ఈసినిమాకు  కొరియన్ కనకరాజు అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు.  ఈ సినిమా ఇండో-కొరియన్ ఫన్ & యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందుతుండటం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా విడుదలైన గ్లింప్స్ వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇందులో వరుణ్ తేజ్ ఒక సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. గ్లింప్స్‌ చూస్తుంటే వరుణ్ తేజ్ ఈసారి హిట్ కొట్టేలానే వున్నాడు.తమన్ బీజీఎమ్ కూడా ఆకట్టుకుంది. ఇక కమెడియన్ సత్య ఉండడం ఈసినిమాకు అడ్వాంటేజ్ కానుంది.తన కామెడీ సినిమాలో హైలైట్ అవ్వనుంది. గ్లింప్స్ కూడా తనతోనే స్టార్ట్ అయ్యింది.సినిమాలో తన కామెడీ ఎలా  ఉండనుందో గ్లింప్స్ ద్వారా చెప్పేశారు. ఇక కొరియన్ కనకరాజ్ గా  వరుణ్ తేజ్ ఎంట్రీ అదిరిపోయింది.ఇందులో తను ఇంటెన్స్ లుక్ లో కనిపించాడు.ఓవరాల్ గా ఈ టైటిల్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది.     

ఈ సినిమాలో ‘మిరాయ్’ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా యూవీ క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్.ఎస్. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వేసవి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. వరుణ్ తేజ్ తన గత చిత్రాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడంతో ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.త్వరలోనే రిలీజ్ డేట్ చెప్పనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.