రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ , స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతున్న సంగతి తెలిసిందే.రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అటు విజయ్ అభిమానుల్లో, ఇటు సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి.ఇందులో విజయ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ పెరిగింది. ఈ చిత్రానికి రౌడీ జనార్ధన అనే పవర్‌ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా పవర్ ఫుల్ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు.ఇందులో విజయ్ లుక్ ను కూడా రివీల్ చేశారు. గ్లింప్స్ చూస్తుంటే రాయలసీమ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్లు వుంది. డైలాగ్స్ ,విజువల్స్ అదిరిపోయాయి.ఓవరాల్ గా ఈ గ్లింప్స్ సినిమాపై అంచానాలు మరింతగా పెంచేసింది. ఈ చిత్రం పూర్తిస్థాయి రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. విజయ్ దేవరకొండ తన గత చిత్రాలకు భిన్నంగా ఇందులో ఒక సరికొత్త మాస్ మేకోవర్‌లో కనిపించబోతున్నాడు.వచ్చే ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఇక విజయ్ ఈ సినిమా కాకుండా ప్రస్తుతం VD 14 కూడా చేస్తున్నాడు.ఈసినిమాను టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. త్వరలోనే ఈ సినిమా నుండి కూడా భారీ అప్డేట్ రానుంది.ఇలా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























