ఓటీటీలోకి వచ్చేసిన ప్రేమంటే

Premante Now Streaming on Netflix

ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన ప్రేమంటే నేటి నుంచే డిజిటల్ ప్రేక్షకులకోసం అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో నవంబర్ 21న విడుదలైన ఈ చిత్రం, సరిగ్గా నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యాంకర్ సుమ కనకాల కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. వెన్నెల కిషోర్, హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్ వంటి హేమాహేమీలు తమ కామెడీతో నవ్వులు పూయించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కథ విషయానికి వస్తే.. పెళ్లికి ముందు ఎంతో ప్రేమగా ఉన్న జంట, పెళ్లయ్యాక చిన్న చిన్న అపార్థాల వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఆ క్రమంలో భార్యకు తెలిసిన తన భర్త గతం ఏమిటి? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా సాగుతుంది.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై పుష్కర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మించిన ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించారు. థియేటర్లలో యావరేజ్ అనిపించుకున్న ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.