టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘సిగ్మా’. జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక ఈసినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అంతేకాదు టీజర్ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఈనెల 23న సాయంత్రం 5 గంటలకు సిగ్మా టీజర్ విడుదలకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయగా, టీజర్ తో ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాలని చిత్ర బృందం భావిస్తోంది. సందీప్ కిషన్ ఈ సినిమాలో సరికొత్త మేకోవర్‌తో కనిపించనుండగా, లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సందీప్ కిషన్, ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని చూస్తున్నారు.మరోవైపు జేసన్ సంజయ్ మెగా ఫోన్ పట్టుకుని చేస్తున్న మొదటి ప్రయత్నం కావడంతో కోలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టీజర్ తో సినిమా కథాంశంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఇందులో జాతి రత్నాలు ఫేమ్ ఫారియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా క్యాథెరిన్ ట్రెసా స్పెషల్ సాంగ్ లో మెరవనుంది.తమన్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























